జూ.ఎన్టీఆర్ - చిరుని ఫాలో అవుతున్న అక్కినేని నాగ చైతన్య.
6 August 2023
అక్కినేని యువ హీరో నాగ చైతన్య హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల తర్వాత హిట్ అందుకోలేకపోయారు చైతు.
ఆ వెంటనే వచ్చిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
దాంతో ఇప్పుడు హిట్ కొట్టాలన్న కసి మీదున్నారు. దాంతో బలమైన కథను సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు తెరకెక్కిస్తున్నారు.
రీసెంట్ గా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సముద్రం నేపథ్యంలోనే ఉంది.
ఆతర్వాత ఇప్పుడు తారక్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
ఈ సినిమా కూడా సముద్రం నేపథ్యంలోనే ఉంటుందని తెలుస్తోంది.
మరి ఈ సినిమా నాగ చైతన్యకి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి