కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్న ఆదా..

6 August 2023

‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాతో నిజంగానే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది అదాశర్మ.

ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘ది కేరళ స్టోరీ’తో వచ్చింది. ఈ సినిమా కేరళలో జరిగిన యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కింది. 

ఇటీవల తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది అదా. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

‘నేను గత కొన్నిరోజులుగా చర్మ సంబంధిత సమస్యతో సతమతమవుతున్నారు.

ఇటీవల తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా నా ఫేస్‌పై కూడా దద్దుర్లు వచ్చాయి.

దీంతో మెడిసిన్స్‌ తీసుకోవడం మొదలుపెట్టాను. అయితే దురదృష్టవశాత్తూ అవి అలర్జీకి దారి తీశాయి.

ఆరోగ్యం విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానని అమ్మకు మాటిచ్చాను.

మరికొన్ని రోజుల పాటు హెల్త్‌పై పూర్తి దృష్టి పెట్టాలనుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుస్తాను’ అంది అదా.