టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నారు
అయితే ఇండస్ట్రీలో కథానాయకుడిగా అడుగుపెట్టి, ప్రతి నాయకుడిగా మారిన వారు చాలా అరుదు. ఈ రెండో జాబితాలోకి జగ్గూబాయ్ కనిపించారు
హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన జగపతిబాబు లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ మెప్పించారు
'మంచి మనుషులు' సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ఆ తర్వాత 'సింహ స్వప్నం' అనే సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి శుభాకాంక్షలు, శుభలగ్నం, పెళ్లి పందిరి, మావిడాకులు, పెళ్లి పీటలు లాంటి హిట్ మువీల్లో నటించారు
తాజాగా 63వ వసంతంలోకి అడుగుపెట్టిన జగపతిబాబు ఓ ఫన్నీ ట్వీట్ షేర్ చేశారు. అదికాస్తా నెట్టింట తెగ వైరలవుతోంది. ఒక చేతిలో వాటర్ బాటిల్, మరో చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని ఉన్న ఫోటో కూడా పోస్ట్ చేశారు
'ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్నా. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. రెండోది ఆలోచించకుండా త్వరగా డిసైడ్ చెయ్యండి. ఈ రెండిట్లో ఏది తాగమంటారు?'
ఇదీ ఆ పోస్టులో జగపతిబాబు షేర్ చేసిన విషయం. ఇక ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే కొత్త ఏడాదిలో 'గుంటూరు కారం', 'కాటేరా' సినిమాలతో ప్రేక్షకులను అలరించారు
ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్‌లో జగపతిబాబు బిజీగా ఉన్నారు. ‘ఇమేజ్’ అనే చట్రంలో ఉండడం తనకు నచ్చదని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 'నేను హీరోని.. హీరో క్యారెక్టర్లే ప్లే చేస్తా. వేరే పాత్రలు పోషించను’ అని అనుకుంటే జైల్లో ఉన్నట్లే ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు