తమ్మడు సినిమా పై ఆశలు పెట్టుకున్న బుట్టబొమ్మ వర్ష బొల్లమ్మ 

Rajeev 

03 july  2025

Credit: Instagram

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది

దళపతి విజయ్ విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది వర్ష. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత తెలుగులో మెరిసింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది. తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే రూపం, ఆక‌ట్టుకునే న‌ట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేస్తోందీ బ్యూటీ. అతి త‌క్కువ స‌మ‌యంలో క్రేజ్ తెచ్చుకుంది.

 మ‌ల‌యాళం, త‌మిళంతోపాటు తెలుగులోనూ న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటుందీ బ్యూటీ. 

ఇక ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది ఈ చిన్నది.