1999లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అందాల తార త్రిష ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకోవడం విశేషం. తాజాగా పొన్నియన్ సెల్వన్‌తో మరోసారి బిజీగా మారింది.
ఇక 41 ఏళ్లు దాటిని చెక్కు చెదరని అందంతో మెస్మరైజ్ చేస్తోందీ చిన్నది. మరి ఇంత వయసులో కూడా త్రిష అందానికి కారణం ఏంటి.? ఆమె డైట్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అందాల తార త్రిష ఉదయం ఎట్టి పరిస్థితుల్లో నూనెలో వేయించిన ఆహారాన్ని తీసుకోదంటా. కచ్చితంగా పోషక విలువలున్న పండ్లను మాత్రమే తింటానని తెలిపింది.
అలాగే ఎక్కువగా ఇంట్లో చేసిన వంటలనే తీసుకుంటుంది. హోటల్ ఫుడ్‌కు పెద్దగా మొగ్గు చూపదు. ఆహారంలో పెరుగు, చపాతి తీసుకుంటుంది
ఇక నిత్యం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకుంటుంది అంటా. ప్రతీ రోజూ కచ్చితంగా సరిపడ తీరు తీసుకుంటుంది. అలాగే జ్యూస్‌లు తాగడానికి ఆసక్తి చూపిస్తుంది.
ఏది ఏమైనా ప్రతీ రోజూ కచ్చితంగా యోగా, వ్యాయమం, ధ్యానం చేయడం మాత్రం మర్చిపోనని చెబుతోంది త్రిష. తన ఫిట్‌నెస్‌కు ఇది కూడా ఒక కారణమని చెబుతోంది.
విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మ, నారింజ రసాలను ప్రధానంగా తీసుకుంటుంది. అయితే చక్కెర, మైదాతో చేసిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది.
సాయంత్రం స్నాక్స్‌లో కూడా నూనె పదార్థాలకు దూరంగా ఉంటూ. కేవలం బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి మాత్రమే తీసుకుంటుంది.