త్రిష బ్యూటీ సీక్రెట్‌ ఏంటో తెలుసా.?

05 February 2024

TV9 Telugu

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే చెక్కు చెదరని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అందాల తార త్రిష

ఇప్పటికే వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ, అందంలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెబుతోంది. ఇంతకీ త్రిష బ్యూటీ సీక్రెట్ ఏంటో తన మాటల్లోనే. 

గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో త్రిష తన బ్యూటీ సీక్రెట్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది. వీటిలో ఒకటి త్రిష ఎక్కువగా విటమిన్‌ సి ఉండే ఆహారం తీసుకకోవడం.

విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నారింజ, దానిమ్మ వంటి పండ్లను తీసుకుంటానని చెప్పిన త్రిష. దీనివల్ల చర్మం ముడతలు వంటి సమస్య నుంచి బయటపడొచ్చని తెలిపింది. 

ఇక త్రిష అందమైన జుట్టుకు తాను ప్రత్యేకమైన ఆయుర్వేద సీరమ్‌ వాడడమే కారణమని ఓ ఇంటర్వ్యూలో తన అందమైన కురుల వెనకాల ఉన్న కారణాన్ని తెలిపింది. 

ఇక త్రిష తీసుకునే ఆహారంలో కచ్చితంగా పుష్కలంగా పోషకాలు ఉండేలా చూసుకుంటుందంటా. పండ్లు, కూరగాయలే తన అందానికి కారణమని తెలిపింది. 

ప్రతీ రోజూ కచ్చితంగా యోగా, వ్యాయామాలు చేయడం వల్లే తాను ఫిట్‌గా ఉంటానని, ఒత్తిడి దూరం కావడానికి రోజంతా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. 

ఇక టీ, కాఫీలకు దూరంగా ఉంటూ గ్రీన్‌ టీనీ ఎక్కువగా తీసుకుంటాననని త్రిష తెలిపింది. తన బ్యూటీ సీక్రెట్ ఇదీ కూడా ఒక కారణమి బ్యూటీ చెప్పుకొచ్చింది.