ఇది అస్సలు ఊహించలేదు.. 

29 January 2024

యానిమల్ చిత్రంతో ఓవర్‌ ననైట్‌ స్టార్‌గా మారిపోయింది అందాల తార త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాలో బోల్డ్‌ రోల్‌లో నటించి మెప్పించింది. 

ఈ సినిమాలో త్రిప్తి కనిపించింది కొద్దిసేపే అయినా.. తనదైన అందం, నటన, బోల్డ్‌ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. 

ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా త్రిప్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టాయి. 

తాజాగా ఢిల్లీలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ అందాల తార తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌ విషయంలో ఎప్పుడూ బాధపడలేదని తెలిపింది. 

సినీ పరిశ్రమలో ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఎత్తుపల్లాలు సహజమని చెప్పుకొచ్చిన ఈ చిన్నది... ప్రతి దాని నుంచీ పాఠాలు నేర్చుకోవాలన్నారు. 

ఇక యానిమల్‌ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని తాను ముందే ఊహించానని, కానీ తన పాత్రకు ఇంత పాపులారిటీ వస్తుందని ఊహించలేదని తెలిపింది. 

ఇక రోజూ నిద్రపోయే ముందు చిత్రబృందాన్ని గుర్తుచేసుకొని థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాని, తనను ఆదరించిన ప్రేక్షకులకు కూడా ఎప్పుడూ కృతజ్ఞురాలినే అని చెప్పుకొచ్చింది

ఇదిలా ఉంటే త్రిప్తికు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. విజయ్‌, గౌతమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో త్రిప్తి ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.