2005లో వచ్చి శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార తమన్న. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిందీ బ్యూటీ.
తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన బ్యూటీ తన ఖాతాల్లో ఎన్నో విజయాలను వేసుకుంది. అనంతరం హీందీతో పాటు తమిళంలోనూ నటించింది
ఇక ఇటీవల తెలుగులో పెద్దగా అవకాశాలు లేని ఈ బ్యూటీ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ చిన్నది.
సోషల్ మీడియా విస్తృతి పెరగడంపై తాజాగా తమన్న స్పందించారు. సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాల్ని వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉందని తమన్న తెలిపింది.
ముఖ్యంగా సెలబ్రిటీలపై వచ్చే పుకార్లపై స్పందించకుండా ఉండటమే మంచిదని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. కొందరు విమర్శించడమే పనిగా పెట్టుకుంటారని..
అలాంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని తమన్నా హితవు పలికింది. ఏదైనా వార్తకు మనం అతిగా స్పందిస్తేనే అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుందని తమన్న చెప్పుకొచ్చింది.
తాను నెగిటివీకి దూరంగా ఉంటూ వృత్తిపైనే దృష్టిపెడతానని తమన్నా తెలిపింది. ప్రేక్షకులు అంతిమంగా తాము చేసిన పాత్రలను, విజయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటారని తెలిపింది.
తనకు ఉత్తరాది, దక్షిణాది రెండు కళ్లలాంటివని.. ఇప్పుడు రెండు చోట్లా మంచి అవకాశాలొస్తున్నాయని తమన్నా చెప్పుకొచ్చింది.