17 August 2023

శ్రీలీల చేసిన మంచి పనికి ఫిదా అయిన నాగశౌర్య

Pic credit - Instagram

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది హీరోయిన్లు అభిమానుల విషయంలో చిన్నచూపు ప్రదర్శిస్తారని టాక్ ఉంది. 

రోషన్ పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల తొలి సినిమాతోనే మంచి మార్కులు సొంతం చేసుకోవడంతో పాటు ధమాకా సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు. 

రాబోయే రోజుల్లో శ్రీలీల నటించిన 10 సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. త్వరలో శ్రీలీల మరికొన్ని కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది.

ఛలో సినిమాతోనే శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యారు.

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య మాట్లాడుతూ మా పేరెంట్స్ నాతో మాత్రమే సినిమాలు చేయడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు

శ్రీలీల స్టార్ హీరోయిన్ కావడం నాకు హ్యాపీ అని నాగశౌర్య అన్నారు. ఒక సందర్భంలో ఫ్లైట్ లో నేను, శ్రీలీల ఉన్నామని శ్రీలీలకు నేను ఆ ఫ్లైట్ లో ఉన్నానని తెలియదని నాగశౌర్య వెల్లడించారు.

బెంగళూరు నుంచి నేను వస్తున్నానని ఒక ముసలావిడ వస్తుంటే  శ్రీలీల తన సీట్ ఆ ముసలావిడకు ఇచ్చి శ్రీలీల బ్యాక్ సీట్ కు వెళ్లిపోయారని అది శ్రీలీల గొప్పదనం అని నాగశౌర్య పేర్కొన్నారు. 

ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ తన సీట్ మరొకరికి ఇచ్చి వెనక్కు వెళ్లడం అంటే గ్రేట్ అని నాగశౌర్య కామెంట్లు చేశారు.