శ్రీలీల క్రేజీ రికార్డు.. అదీ ఇంత తక్కువ టైంలో

02 August 2023

Pic credit - Instagram

యంగ్ సెన్సేషన్ శ్రీలీల నక్క తోక తొక్కింది. 

లేకపోతే ఏంటబ్బా.. తిప్పికొడితే పాతికేళ్లు లేవు. 

కానీ స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది. 

 ప్రస్తుతం ఈమె చేతిలో 10 వరకు సినిమాలున్నాయి. 

వీటిలో దాదాపు ఐదు చిత్రాలు.. వచ్చే ఆరు నెలల్లో థియేటర్లలోకి రానున్నాయి. 

మెగాహీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' ఆగస్టు 18న, రామ్ 'స్కంద' సెప్టెంబరు 18న, 

బాలకృష్ణ 'భగవంత్ కేసరి' అక్టోబరు 19న, నితిన్ 'ఎక్స్ ట్రా' డిసెంబరు 23న, 

మహేశ్ 'గుంటూరు కారం' జనవరి 13న థియేటర్లలోకి రానున్నాయి.

గతంలో ఓ హీరోయిన్ నటించిన రెండు మూడు చిత్రాలు వరస నెలల్లో విడుదలయ్యాయి. 

కానీ ఇలా ఐదు సినిమాలు, అది కూడా ఇంత తక్కువ టైంలో రావడం మాత్రం బహుశా ఇదే తొలిసారి అనిపిస్తుంది.