29 August 2023

బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. పాన్ ఇండియా స్టార్ తో..

ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది యంగ్‌ బ్యూటీ శ్రీలీల.

నిర్మాతలు అందరూ కూడా క్యూ కట్టుకుని మరీ ఈ హీరోయిన్‌నే ఎంపిక చేసుకుంటున్నారు.

ఇప్పుడు రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొన్నటి వరకు బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌'ను తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.

మళ్లీ ఏమైందో తెలియదు కానీ ఆమె ప్లేస్‌లో క్రేజీ హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నారట ఈ మూవీ మేకర్స్‌.

అంతేకాదు చరణ్‌ కూడా ఈ మూవీలో శ్రీలీల నేమ్‌ను సజెస్ట్‌ చేసినట్లు మూవీ సర్కిల్స్‌లో టాక్‌.

పాన్‌ ఇండియా స్టార్‌ హీరోనే స్క్రిప్ట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మడిని పేరు సజెస్ట్ చేసాడని టాక్..

శ్రీలీల రేంజ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.