తనకంటే చిన్నవాడితో స్టార్‌ హీరోయిన్‌ డేటింగ్‌

20 June 2024

TV9 Telugu

TV9 Telugu

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది

TV9 Telugu

స్ట్రీ-2, చందు ఛాంపియన్‌ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది

TV9 Telugu

ఈ మువీకి  రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే గత కొంతకాలంగా శ్రద్ధా అతనితో చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తుంది

TV9 Telugu

వీరిద్దరి ఫోటోలను తాజాగా నటి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరై ఉంటారా అని నెటిజన్స్‌ తెగ ఆరా తీస్తున్నారు

TV9 Telugu

'తు ఝూథీ మెయిన్ మక్కార్' సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్‌ హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది

TV9 Telugu

ఇందులో రాహుల్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. ‘నా మనసును తీసుకెళ్లు.. కానీ, నా నిద్రను తిరిగిచ్చేయ్‌’ అనే క్యాప్షన్‌తో అతడి చేతిని పట్టుకొని నవ్వుతూ కనిపించింది

TV9 Telugu

మరోవైపు అతను శ్రద్ధా కపూర్‌ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్‌కు 34 ఏళ్లు కాగా.. శ్రద్ధా కపూర్‌ 37 ఏళ్లు. పైగా అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లోనూ ఈ జంట తళుక్కున మెరిసింది

TV9 Telugu

వీటన్నింటినీ ఒకదానికొకటి లింక్‌ చేసిన నెటిజన్లు మొత్తానికి రాహుల్-శ్రద్ధా డేటింగ్‌లో ఉన్నారంటూ తేల్చిపడేశారు. అంతేనా.. వీరికి విషెస్‌ తెలుపుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు

TV9 Telugu

కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు