TV9 Telugu

09 March 2024

నేను తీసుకున్న కఠిన  నిర్ణయం అదే..

మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సమంత చికిత్సలో భాగంగా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

సామ్‌ ఇటీల కొత్త సినిమాదేనికి సైన్‌ చేయలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్‌ డీలా పడ్డారు. సామ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే 2023లో వచ్చి ఖుషీ చిత్రం తర్వాత సమంత మరో చిత్రంలో నటించలేదు. ఈ బ్యూటీ నటించిన చివరి వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. 

తాజాగా ఓ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్న సామ్‌ సినిమాలకు గ్యాప్‌ ఇవ్వడంపై స్పందించింది. ఈ విషయమై ఆమె కాస్త ఎమోషన్‌కు గురయ్యారు. 

తాను జీవితంలో తీసుకున్న క్లిష్టమైన నిర్ణయం ఇదేనన్న సమంత మయోసైటిస్‌ నుంచి కోలుకోవడానికి సినిమాల నుంచి విరామం తీసుకున్నానని తెలిపింది.

ఆరోగ్య పరిస్థితుల కారణంగా పనిచేయడం కుదరలేదన్న సమంత.. పని పరంగా ఒత్తిడి, ఇతర విషయాలను తట్టుకోవడం అంత సులభం కాదని చెప్పుకొచ్చింది. 

13 ఏళ్ల నుంచి పని చేస్తున్నానని, కోపం, ఆత్మనూన్యత భావాలను ఎదర్కొని మనిషిగా ఎదగాలని శ్రమించానని చెప్పుకొచ్చింది సామ్‌. 

కష్టసుఖాల్లో అండగా నిలిచిన అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపిన సామ్‌.. ‘సిటాడెల్‌’లో తన పాత్ర తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చారు.