TV9 Telugu

12 May 2024

రష్మిక టైమ్‌ మాములుగా  లేదుగా.. 

ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల తార రష్మిక. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది.

తర్వాత గీతగోవిందం సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. అనంతరం రష్మికకు వరుసగా బడా సినిమాలు అవకాశం దక్కాయి. పుష్ప తర్వాత భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. 

ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప2 సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్ట్‌ 15వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేయనుంది రష్మిక.

రష్మిక నటిస్తున్న మరో ప్రెస్టేజియస్‌ మూవీ సికిందర్‌. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించే అవకాశం కొట్టేసింది. మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

విక్కీ కౌశల్‌, అక్షయ్‌ ఖన్నాలు హీరోగా నటిస్తున్న ఛావా చిత్రంలో కూడా రష్మిక నటించే అవకాశం కొట్టేసింది. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

రష్మిక నటిస్తున్న మరో పాన్‌ ఇండియా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్‌, నాగార్జున హీరోలుగా తెరకెక్కనున్న సినిమాలో రష్మిక నటిస్తోంది. 

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుటోంది.

వీటితో పాటు రష్మిక నటిస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ రెయిన్‌బో. గతేడాది ఈ సినిమాను మేకర్స్‌ ప్రకటించారు. ఇలా వరుస సినిమాలతో రష్మిక ఫుల్‌ బిజీగా ఉంది.