నేను ఆరు భాషల్లో మాట్లాడుతా..

రష్మిక మందన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది

సమయం దొరికినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్తుంది

తాజాగా నెటిజన్లతో చిట్‌చాట్‌ చేసిన రష్మిక పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది

కర్ణాటకలోని కూర్గులో ఉన్న రష్మిక సొంత ఇల్లు అంటే ఎంతో ఇష్టమట

అంతేకాకుండా తాను ఆరు భాషల్లో మాట్లాడగలనని నెటిజన్లకు తెల్పింది

కొరియన్‌ ఫ్రైడ్‌ చికెన్‌ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది

ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం మూడు మువీల్లో నటిస్తోంది

‘పుష్ప2’లో శ్రీవల్లిగా కనిపించనుంది. అలాగే యానిమల్, ‘రెయిన్‌ బో’ సినిమాల్లోనూ నటిస్తోంది