TV9 Telugu
20 April 2024
రష్మిక ఇంత ఫిట్‌గా ఎలా
ఉంటుందో తెలుసా.?
పుష్ప చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది అందాల తార రష్మిక. తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోందీ బ్యూటీ.
ఇక సినిమాల విషయంలోనే కాకుండా తన ఫిట్‌నెస్ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటుందీ బ్యూటీ. రష్మిక ఇంత ఫిట్‌గా ఉండడానికి కారణాన్ని పలు ఇంటర్వ్యూలో తెలిపింది.
రష్మిక ఎక్కువగా స్క్వాట్స్, ప్లాంక్ లతో పాటు, బరువులు మోయడం లాంటి వర్కవుట్స్ చేస్తానని తెలిపింది. తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనని తెలిపింది.
ఇక రష్మిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆమె ఎక్కువగా కిక్ బాక్సింగ్ చేస్తుంటుంది. ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి కూడా ఇదే పని చేస్తానని తెలిపింది
వీటితో పాటు ప్రతీ రోజు కచ్చితంగా వాకింగ్ చేస్తానని తెలిపిందీ చిన్నది. తాను ఫిట్‌నెస్‌గా ఉండడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పుకొచ్చింది.
ఇక తన ఫిట్‌నెస్‌కు తీసుకునే ఆహారం కూడా ఒక కారణమని రష్మిక తెలిపింది. నిత్యం హైడ్రేట్‌గా ఉండేందుకు నీటిని ఎక్కువగా తాగుతానని చెప్పుకొచ్చింది
ప్రతీ రోజు కచ్చితంగా సరిపడ మంచి నీటిని తీసుకుంటానని, ఉదయం లేవగానే మంచి నీటితోనే తన రోజును మొదలు పెడుతానంటూ తెలిపింది.
అంతేకాకుండా ఎక్కువగా ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటానని, బయటి ఫుడ్‌కు దూరంగా ఉండడమే తన బ్యూటీ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..