ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. శ్రీవల్లి పాత్రలో దేశాన్ని ఊపేసింది.
ఇక ప్రస్తుతం పుష్ప సీక్వెల్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రష్మిక ఆసక్తికర విషయాలను పంచుకుంది.
పుష్ప 2లో తన పాత్రకు ఎన్నో బాధ్యతలు ఉంటాయని, ఇందులో తాను పుష్పకు భార్యగా కనిపిస్తానని తెలిపిందే. సీక్వెల్ ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఫస్ట్ పార్ట్‌కి భారీ ఎత్తున స్పందన రాడంతో రెండో పార్ట్‌పై అంచనాలు ఉన్నాయని, సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని ఎంతో పర్‌ఫెక్ట్‌గా తీస్తారని తెలిపింది.
ఇక పుష్ప సినిమా యూనిట్‌తో తనకు మంచి అనుబంధం ఏర్పడిందన్న రష్మిక.. సీక్వెల్ షూటింగ్ కోసం వెళ్లగానే సొంతింటికి వెళ్లినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న పుష్ప సీక్వెల్ చిత్రం.. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు.
ఇక రష్మిక ప్రస్తుతం టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్ అనిమే అవార్డుల వేడకకు హాజరయ్యేందుకు జపాన్ వెళ్లింది. ఈ వేడుకకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందని రష్మిక చెప్పుకొచ్చింది