పుష్ప చిత్రంతో రష్మిక కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. పాన్ ఇండియాగా వచ్చిన ఈ సినిమా విజయంతో బ్యూటీకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో నటించినా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది.
ఇక ఈ సినిమా తర్వాత బలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లను ఈ బ్యూటీకి క్యూ కట్టాయి. తాజాగ వచ్చిన యానిమల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో రష్మిక తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేసిందని వార్తలు షికార్లు చేశాయి. నెట్టింట ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
రష్మిక ఏకంగా సినిమాకు రూ. 4 నుంచి రూ. 5 కోట్లు వసూలు చేస్తుంది అని నెట్టింట తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీంతో తాజాగా ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించించి రష్మిక. అయితే సూటిగా సమాధానం చెప్పకుండా తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యింది.
రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలు నిజమైతే బాగుండు అంటూ సెటైరికల్‌గా స్పందించిందీ చిన్నది.
దీంతో రష్మిక చేసిన కామెంట్స్‌పై నెట్టింట పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మిక నిజంగానే రెమ్యునరేషన్‌ను పెంచేసిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.