ఓహో రకుల్ బ్యూటీ సీక్రెట్ ఇదా..!
TV9 Telugu
10 February 2024
కన్నడ చిత్రం ద్వారా మూవీ ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్.
అనంతరం తెలుగులో కెరటం మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తొలి విజయాన్ని అందుకుందీ బ్యూటీ. ఈ సినిమా విజయంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
అనంతరం వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోల సరసన నటించిందీ చిన్నది.
ఇక అందానికి పెట్టింది పేరుగా ఉండే రకుల్.. తన బ్యూటీ సీక్రెట్‌ను గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అందాన్ని సంరక్షించుకోవడానికీ ఎంతో కేర్ తీసుకునే రకుల్, తన సౌందర్య సంరక్షణకు అరటిపండు వాడుతున్నట్లు తెలిపింది.
అరటిపండు ఫేస్ ప్యాక్‌తో మృతకణాలు తొలగి, చర్మం మెరుస్తుందని, అరటిలోని.. మాంగనీస్ కొల్లాజెన్ స్థాయిని పెంచుతుందని చెప్పుకొచ్చింది.
ఇక స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ముఖంపై మసాజ్ చేసుకుంటానన్న రకుల్.. అలాగే, టొమాటోతో ఫేస్ ప్యాక్ చేసుకుంటానని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి..