ప్చ్‌.. అందం ఉన్నా, అదృష్టం లేదు. 

25 August 2023

Pic credit - Instagram

ఓరు ఆదర్‌ లవ్‌ మూవీతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించకపోయినా ఈ బ్యూటీ క్రేజ్‌ దక్కించుకుంది. 

ఓ చిన్న కన్నుగీటిన సన్నివేశంతో సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుందీ బ్యూటీ. ఈ వీడియో నేషనల్ వైడ్‌గా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఈ క్రేజ్‌తో బ్యూటీకి వరుసగా సినిమాలు క్యూ కట్టాయి. టాలీవుడ్‌ మొదలు బాలీవుడ్‌ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువత్తాయి. తెలుగులోనూ పలు వరుస సినిమాల్లో నటించింది.

ఆఫర్లు అయితే వచ్చాయి కానీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేక పోయాయి. ఇంతలా అంటే ఈ బ్యూటీకి ఇప్పటి వరకు ఒక్క సరైన హిట్ పడలేదు. 

చివరిగా నటించిన బ్రో సినిమా మినహా ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ మూవీ లేదని చెప్పాలి. అయితే ఈ సినిమాలో కూడా లీడ్‌ రోల్ కాకపోవడంతో ప్రియాకు పెద్దగా పేరు రాలేదు. 

విజయాలు లేకపోయినా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ప్రస్తుతం హిందీలో ఏకంగా నాలుగు చిత్రాలు, కన్నడలో ఒక సినిమాలో నటిస్తోందీ అందాల తార. 

ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ హల్చల్‌ చేస్తోంది. గ్లామర్‌ ఫొటోలతో సందడి చేస్తోంది. ఇన్‌స్టా వేదికగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్‌ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూనే మరోవైపు కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతోందీ చిన్నది