మేడం సార్ మేడం అంతే.. అమ్మడి కమ్ బ్యాక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
05 November 2025
Pic credit - Instagram
Rajeev
టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు.
హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు.
ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది. కానీ అంతగా అవకాశాలు రాలేదు.
తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది.
ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది.