ఎట్టకేలకు ఛాన్స్‌ కొట్టేసిన పూజా.. 

04 February 2024

TV9 Telugu

కెరీర్‌ తొలినాళ్లలో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయిన పూజా హెగ్డే, ఆ తర్వాత ఆ స్థాయిలో అవకాశాలను దక్కించుకోలేదనే చెప్పాలి. 

2022లో వచ్చిన ఆచార్య చిత్రం తర్వాత మళ్లీ పూజా ఆ స్థాయి సినిమా అవకాశాన్న దక్కించుకోలేదు. ఎఫ్‌లో ఒక స్పెషల్‌ సాంగ్‌లో మాత్రమే కనిపించింది.

హిందీలో సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'కిసీ కి భాయ్‌, కిసీకి జాన్‌' అనే సినిమాలో నటించినా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. 

ఈ సినిమా రిజల్ట్‌ తర్వాత పూజాకు అవకాశాలు దక్కలేదు. దీంతో ఈ బుట్ట బొమ్మ కెరీర్‌ ఇక క్లోజ్‌ అయ్యిందని అంతా చర్చించుకున్నారు. 

అయితే తాజాగా ఓ తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసిందీ బ్యూటీ. శింబు హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. 

దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనుందని తెలుస్తోంది. 

ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనేతో పాటు కీర్తి సురేష్‌ నటిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే కీర్తి ప్లేస్‌లో తాజాగా పూజాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. 

దీంతో చాలా ఏళ్ల తర్వాత పూజా మరో అవకాశాన్ని దక్కించుకున్నట్లైంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.