బుట్టబొమ్మ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. 

TV9 Telugu

20 February  2024

అలవైకుంఠపురం తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది అందాల తార పూజా హెగ్డే. ఈ సినిమా విడుదలై నాలుగేళ్లు దగ్గరపడుతోంది. 

ఈ సినిమా తర్వాత పూజా సుమారు 8 సినిమాల్లో నటించిన ఒక్కటి కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. వీటిలో రాధేశ్యామ్‌, ఆచార్య వంటి భారీ చిత్రాలు సైతం ఉన్నాయి. 

ఇక ఆచార్య తర్వాత తెలుగులో పూజా నటించిన సినిమా లేదని చెప్పాలి. ఎఫ్‌3 చిత్రంలో మాత్రం ఐటమ్‌ సాంగ్‌లో తళుక్కుమంది. ఆ తర్వాత మళ్లీ నటించలేదు. 

ఇక 2023లో వచ్చిన కిసి కా భాయ్‌ కిసి కా జాన్‌ సినిమాతో అదృష్టం పరీక్షించుకున్న పూజాకు వైఫల్యమే ఎదురైంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. 

దీంతో సుమారు ఏడాది గడుస్తోన్న పూజా కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదని చెప్పాలి. దీంతో బుట్టబొమ్మ అభిమానులు బ్యూటీ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే పూజా హెగ్డే నటిస్తున్న తాజా చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పూజా లేటెస్ట్ మూవీ దేవ అక్టోబర్‌ 11న విడుదల కానుంది. 

ఈ సినిమాలో కొత్త పూజాని చూస్తారని చెబుతోందీ చిన్నది. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నట్లు తెలిపింది. 

హై ప్రొఫైల్‌ కేస్‌ ఇన్విస్టిగేషన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని, కథనం షాక్‌కు గురిచేస్తుందని, తన పాత్ర తీరుతెన్నులు ఆడియన్స్‌ని షాక్‌కి లోనుచేస్తాయని చెప్పుకొచ్చింది.