2023లో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీలు.. 

24 December 2023

ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమై అందాల తారల్లో సాక్షి వైద్య ఒకరు. అఖిల్‌ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీతో ఈ చిన్నది ప్రేక్షకులను పలకరించింది. 

ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోయినా ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌తో ఉస్తాద్‌ భగవత్‌ సింగ్‌తో పాటు మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టే పనిలో ఉందీ బ్యూటీ. 

ఇక ఈ ఏడాది తెలుగు కుర్రకారును అట్రాక్ట్ చేసిన మరో బ్యూటీ నుపుర్‌ సనన్‌. రవితేజ హీరోగా వచ్చిన టైగర్‌ నాగేశ్వర్‌ మూవీ ద్వారా ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 

ఈ సినిమాలో తనదైన అందం, నటనతో మెప్పించిన ఈ చిన్నది మంచి మార్కులు కొట్టేసింది. ఇక ప్రస్తుంత ఈ చిన్నది మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న భక్త కన్నప్ప మూవీలో నటిస్తోంది.

ఇక ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మరో అందం కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్‌. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన అమిగోస్‌ చిత్రం ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ తన అందంతో అట్రాక్ట్ చేసింది.

అమిగోస్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా ఈ బ్యూటీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న 'నా సామిరంగ' చిత్రంలో నటిస్తోందీ చిన్నది.

మాలీవుడ్‌, కోలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెబ మోనిక ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైంది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సామజ వరగమన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. 

ఈ సినిమాలో తనం అందం అభినయంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిందీ చిన్నది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు తెలుగులోనూ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.