వరస ఫోటోషూట్స్ తో కుర్రకారుని ఆకట్టుకుంటున్న మెగా డాటర్ నిహారిక..

Anil Kumar

14 December 2024

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. ఈమె ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా.

సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసిన నిహారిక.. ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ.. తమ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది నిహ.

అయితే హీరోయిన్ గా మాత్రం నిహారిక ఎక్కువ సినిమాల్లో నటించలేదు. కేవలం అతి కొద్దీ సినిమాలకు మాత్రమే ఆగిపోయింది.

ఆమె తిరిగి సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు అని ఇండస్ట్రీ సమాచారం.

ఎట్టకేలకు ఇప్పుడు నిహారిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంది.

అది కూడా హీరోయిన్ గా కాదు.. ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తోంది నిహారిక. వెబ్ సిరీస్ లకు కూడా ప్రొడ్యూస్ చేసింది.

తాజాగా న్యూ ఫోటోషూట్ తో నెట్టింట కుర్రకారుని ఆకట్టుకుంటూ.. బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ నిహారిక.