ఇంత అందాన్ని పట్టించుకోవడం లేదే.. మత్తెక్కిస్తున్న నభా నటేష్ 

Rajeev 

03 july  2025

Credit: Instagram

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే క్లిక్ అయిన హీరోయిన్ నభా నటేష్. ఈ అమ్మడి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. 

2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ నభా నటేష్.

అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుంది. 

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది.

డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. 

దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 

 ఇక ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సినిమాలను లైనప్ చేసింది. కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోతోంది.