'డ్రస్సుల కోసం రూ.2 వేలకు మించి ఖర్చు చేయను'

April 16, 2024

TV9 Telugu

బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించి.. ఆపై వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న అందాల నాయికలు చాలామందే ఉన్నారు. వారిలో అందాల హీరోయిన్‌  మృణాల్‌ ఠాకూర్‌ ఒకరు

‘కుంకుమ్‌ భాగ్య’ సీరియల్‌లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ 'సీతారాం' మువీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలుత ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేసింది

తన అందంతోనే కాదు.. ఫ్యాషన్‌ ఎంపికలతోనూ మైమరపిస్తుంటుందీ బ్యూటీ. ఆమె ధరించే ఒక్కో డ్రస్‌ చూస్తే ఎన్ని వేలు ఖర్చు పెట్టి కొంటుందో అని అంతా అనుకుంటారు

 తాను మాత్రం ఖర్చు పెట్టడానికీ అస్సలు ఇష్టపడనంటోంది. అసలు తన దృష్టిలో బట్టలకు ఖర్చుచేయడం వృథా ఖర్చని అంటోంది టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌

తన వార్డ్‌రోబ్‌ చాలా సింపుల్‌గా ఉంటుందని, దుస్తుల కోసం పెట్టే ఖర్చు విషయంలో చాలా పొదుపుగా వ్యవహరిస్తానంటూ ఈ ‘ఫ్యామిలీ స్టార్’ భామ తన ఫ్యాషన్‌ ఎంపికల గురించి చెప్పుకొచ్చింది

ఫ్యాషన్‌ ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన ఫ్యాషన్లను, డిజైనర్‌ దుస్తుల్ని ప్రయత్నించడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. నచ్చితే చాలు.. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొనేస్తుంటారు

ఖరీదైన దుస్తుల్ని చాలా అరుదుగా వేసుకుంటాం.. ఒకట్రెండుసార్లు వేసుకొని పక్కన పడేసే దుస్తుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం వృథానే. ఈవెంట్లకు నేను వేసుకునే దుస్తులు అద్దెకు తెచ్చుకుంటానంటోంది మృణాల్‌

ఇలా చేయడం వల్ల డబ్బూ ఆదా అవుతుంది. ఆయా దుస్తుల్ని ధరించామన్న సంతృప్తీ కలుగుతుంది. దుస్తులపై ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం నాకు నచ్చదు. నేను ఒక టాప్‌ కొనాలంటే అందుకు రూ. 2 వేలకు మించి ఖర్చు చేయనంటోదీ ‘ఫ్యామిలీ స్టార్’ బ్యూటీ