జోరు పెంచిన మృణాల్.. ఇకపై అక్కడ కూడా..
09 February 2024
TV9 Telugu
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో అద్భుత నటనతో మెస్మరైజ్ చేసింది.
అంతకుముందు హిందీలో నటించిన గ్లామర్ పాత్రలతో రాని పేరు మృణాల్‌కు సీతారామంతో వచ్చిందని చెప్పాలి.
సీతారామం చిత్రం ఊహించని విజయంతో ఈ బ్యూటీకి వరుస అకాశాలు క్యూ కట్టాయి. హిందీతో పాటు తెలుగులోనూ సినిమా ఛాన్స్‌లు వచ్చాయి.
ఈ క్రమంలోనే తాజాగా నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' చిత్రంతో భారీ హిట్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ.
ఈ సినిమా కూడా విజయం సాధించడంతో విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిందీ చిన్నది.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి కోలీవుడ్ నుంచి ఆహ్వానం లభించినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్ హీరోగా నటించే చిత్రంలోనూ మృణాల్ నటించనుందని సమాచారం.
శింబు హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ మృణాల్ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే సౌత్‌లో మృణాల్ బిజీగా మారడం ఖాయం.
ఇక్కడ క్లిక్ చేయండి..