ఆ కారణంతో పెద్ద ప్రాజెక్ట్స్ వదులుకున్నాను..
28 January 2024
TV9 Telugu
ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార మీనా క్షి చౌదరి.
తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. స్క్రిప్ట్ ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ముందే చెప్పేస్తానని చెప్పుకొచ్చింది.
స్క్రిప్ట్ అసౌకర్యంగా ఉన్న కారణంగా పలు పెద్ద పెద్ద ప్రాజెక్టులను సైతం వదులుకున్నట్లు అందాల తార చెప్పుకొచ్చింది.
మరీ అసభ్యకరంగా లేకుంటే ముద్దు సీన్స్‌కు ఓకేనని, కానీ కేవలం ముద్దు సీన్ల కోసమే అంటే.. వద్దని చెబుతానని తెలిపింది.
ఇక తెలుగు సినిమా పరిశ్రమ తన పట్ల చాలా ఆప్యాయత చూపుతుందని, భాష ఏదైనా మంచి సినిమాలు చేయాలనేదే తన కోరిక అని చెప్పుకొచ్చింది.
ఇక డబ్బు కంటే తాను చేసేపనికి ప్రశంసలతోపాటు గౌరవం దక్కాలని కోరుకుంటున్నాని మనసులో మాట బయట పెట్టిందీ చిన్నది.
ఇక మహేష్ గురించి మాట్ఆలడుతూ.. మహేశ్‌బాబు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, ఆయన చాలా మంచి వ్యక్తని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..