టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన మమతా మోహన్ దాస్
తెలుగు తెరకు యమదొంగ సినిమాతో కథానాయికగా పరిచయమైంది మమతా మోహన్ దాస్.
ఆ తర్వాత తెలుగులో కేడీ, కింగ్, చింతకాయల రవి వంటి సినిమాలు చేసి అలరించింది.
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే క్యాన్సర్ భారిన పడింది.
ఎన్నో పోరాటాల అనంతరం క్యాన్సర్ నుంచి కోలుకున్న మమతా ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది.
ఇటీవలే రుద్రంగి సినిమాతో మరోసారి అదరగొట్టింది. జగపతి బాబు నటించిన ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించింది మమతా.
ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి చిత్రంలో నటించనుంది.
మక్కల్ సెల్వన్ 50వ చిత్రంలో మమతా కీలకపాత్ర కోసం ఎంపికైంది.
మాహరాజా అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్, సుదన్ సుందరం సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి