వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న కుర్రభామ.. స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్‌లు

08 November 2025

Pic credit - Instagram

Rajeev 

 ప్రేమలు సినిమాతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన కేరళ కుట్టి మమితా బైజు. 

యువత అభిమానించే ఈ హీరోయిన్ కు నేడు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మమిత చిన్ననాటి చిత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

మమిత తొలి చిత్రం సర్వోపరి పాలకరన్, ఇది 2017లో విడుదలైంది. తరువాత మమితా బైజు వరుసగా సినిమాలు చేసింది. 

మమిత హనీ బీ 2, డాకిని, వరథన్, యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ, వికృతి, ఆపరేషన్ జావా, టూ, సూపర్ శరణ్య, ప్రణయవిలాసం, రామచంద్ర బోస్ వంటి అనేక చిత్రాల్లో నటించింది.

ప్రేమలు సినిమాతో ఈ బ్యూటీకి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడుకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. 

ఇటీవలే డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో మెప్పించింది. 

ప్రస్తుతం మమిత తమిళ నటుడు సూర్యతో కలిసి నటిస్తుంది. అలాగే ఈ అమ్మడి మరికొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.