లయ కేవలం నటనలోనే కాకుండా చిన్నప్పటి నుంచే చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ ఎంతో చురుగ్గా ఉండేదట. తాజాగా ఆమె తనలో ఉన్న ఒక సూపర్ హిడెన్ టాలెంట్‌ను బయట పెట్టింది.
పైకి ఎంతో కూల్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపించే లయ చిన్నతనంలో ఒక ఆటలో ఏకంగా ఏడు సార్లు రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌గా నిలిచిందట.
ఆ మైండ్ గేమ్‌లో ఎంతోమంది మేధావులను సైతం ఓడించి టైటిల్స్ గెలుచుకుంది. ఆ ఆట మరేదో కాదు 'చెస్'. లయకు చిన్నప్పటి నుంచే చెస్ ఆడటం అంటే ఎంతో ఇష్టం ఉండేదట.
కేవలం ఇష్టంతోనే సరిపెట్టుకోకుండా, ఎంతో కష్టపడి రాత్రింబగళ్లు సాధన చేసి ఏకంగా ఏడు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్‌గా నిలిచింది.
కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలో జరిగిన పలు ప్రతిష్టాత్మక చెస్ పోటీలలో కూడా లయ పాల్గొని ఎన్నో పతకాలను సాధించింది.
అయితే పదో తరగతికి వచ్చాక చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావడంతో ఈ ఆటను ఆపేసింది. ఇటీవల లయ తన చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.
ఆమెకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఘన విజయం సాధించి విన్నర్‌గా నిలిచింది.