03 AUGUST 2023

ప్రొడ్యూసర్ గా మారనున్న కృతి సనన్..

కృతి సనన్.. ఇప్పుడు దేశమంతా వినిపిస్తోన్న పేరు ఇది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పటివరకు కథానాయికగా అలరించిన కృతి..

ఇప్పుడు నిర్మాతగా మారనుందట. కానీ థియేటర్లలో విడుదల కాబోయే సినిమాల కోసం కాదు అంట..

ఓటీటీ చిత్రాలకు నిర్మాతగా మారనున్నారు అంట.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాకు..

కృతి సనన్ నిర్మాతగా వ్యవహరిస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట.

త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.