తెలుగు సినిమాలకు ఈ అందాల భామ దూరమైనట్టేనా..?

06 November 2025

Pic credit - Instagram

Rajeev 

 అందం అభినయం ఉన్న కూడా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్న ఆ బ్యూటీ ఎవరో కాదు. కృతి కర్బందా..

ఈ అమ్మడి పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. 

ఈ బ్యూటీ ఇప్పుడు హిందీ, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో బోణి అనే సినిమాతో పరిచయం అయ్యింది 

తొలి సినిమాతో నటిగా మంచి మార్కులను కొట్టేసింది కృతి . తెలుగులో సినిమాలు చేస్తూనే కన్నడ భాషలోనూ అవకాశాలు అందుకుంది.

అక్కడ కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది కృతి కర్బందా.. ఉన్నట్టుండి తెలుగు నుంచి మాయం అయ్యింది.

ఆతర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేసింది. అక్కడ హీరోయిన్ గా పలు సినిమాల్లోనటించి మెప్పించిన ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ దక్కాయి.

బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ అక్క పాత్రలో కనిపించింది. ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేసింది.