01 AUGUST 2023

అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది..: కేతిక శర్మ.

కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ సినిమాతో పరిచయం అయ్యింది కేతిక శర్మ .

తొలి సినిమాతోనే అందంతో కట్టిపడేసింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. కేతిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.

రొమాంటిక్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంటుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బయోపిక్స్ లో నటించాలని ఉందని తెలిపింది కేతిక.

అలాగే స్విమింగ్ అంటే తనకు చాలా ఇష్టమని..

స్విమింగ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటించాలన్నది తన కోరిక అని తెలిపింది కేతిక