నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. తమిళంతోపాటు తెలుగులోనూ సత్తా చాటుతోంది.
మహానటి సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది. ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
గ్లామర్ పాత్రలకు వీలైనంత వరకు దూరంగా ఉంటూనే మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ చిన్నది హిందీ చిత్రాల్లోనూ నటించింది
ఇక ఈ బ్యూటీకి అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి స్టార్ హీరోయిన్ తాజాగా ఓ ఫ్యాన్‌కు స్వారీ చెప్పింది.
కృష్ణ అనే ఫ్యాన్ కీర్తికి 233 లెటర్స్ రాసి ఆమెకు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ వచ్చాడు. అయితే కీర్తి సురేష్ మాత్రం వీటికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.
అయితే 243 లెటర్‌కు కీర్తి సురేశ్ బదులిచ్చింది. అభిమాని లేఖలకు స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.
243 తనకు ఫాంటసీ నెంబర్ అని తెలిపిన కీర్తి ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు 'లాట్స్ ఆఫ్ లవ్' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం.. నటించిన సైరన్, రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.