అలాంటి సీన్స్‌ ఉన్నా పర్లేదని నా భర్తే చెప్పాడు.. 

06 January 2023

వరంగల్‌కు చెందిన ఆనందిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ తెలుగమ్మాయి తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక తెలుగులో జాంబిరెడ్డి, శ్రీదేవీ సోడా సెంటర్‌ వంటి మూవీస్‌తో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా మాంగైలో చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ. 

అయితే ఈ సినిమాలో పలు బోల్డ్‌ సన్నివేశాలు ఉన్నాయని, అలాగే బూతు డైలాగ్స్‌ కూడా ఉన్నాయన్న కారణంతో మొదట ఈ సినిమాకు నో చెప్పిందంటా. 

తన భర్త మాంగై చిత్రంలో నటించేలా ప్రోత్సహించారని చెప్పుకొచ్చింది. బోల్డ్‌ సన్నివేశాలు ఉన్నా పర్వాలేదు, మంచి కథ ఉంది కాబట్టి వదులుకోవద్దని చెప్పారంట. 

ఆనందిని భర్త పేరు సోక్రటీస్‌, ఈయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే. సోక్రటీస్‌ దర్శకుడిగా పలు చిత్రాలు తెరకెక్కించారు. 

ఆనందినికి, సోక్రటీస్‌కు 2021లో వివాహమైంది. తన భర్త ప్రోత్సాహంతోనే మాంగై చిత్రంలో నటించానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. 

ఇక ఇప్పటికే మాంగై చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సినిమాలో బోల్డ్‌ కంటెంట్‌ ఉందని చెప్పకనే చెబుతోంది. అందుకే తొలుత ఆనందిని ఈ సినిమాను రిజక్ట్ చేసిందంటా. 

మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణమైన యువతి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెకిస్తున్నారు.