ఈ ముద్దుగుమ్మ కోసం కుర్రహీరోలు పోటీపడుతున్నారే..
15 May 2025
Rajeev
Credit: Instagram
కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొ
ంతం చేసుకుంది
ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది.
కాయదు 2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచింది. ఆమె 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో నట
నా రంగంలోకి అడుగుపెట్టింది
2022లో విడుదలైన పాథోన్‌పథం నూట్టండుచిత్రం మలయాళంలో ఆమె మొదటి సినిమా, ఇది తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ ప
ేరుతో 2023లో విడుదలైంది.
2022లో అల్లూరి చిత్రంలో శ్రీ విష్ణు సరసన నటించింది, కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.
ఇప్పుడు ఈ చిన్నది తెలుగు లో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. కుర్ర హీరోలు ఈ భామ కోసం పోటీపడుతున్నారు.
కాయదు ప్రస్తుతం తమిళ చిత్రం ఇదయం మురళి లో నటిస్తోంది, అలాగే థారం అనే చిత్రంలో సిలంబరసన్ సరసన కథానాయ
ికగా నటించనుందని సమాచారం.
సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యూజిక్ డైరెక్టర్‌గా కమెడియన్ సప్తగిరి.. ఆ మూవీ ఏంటంటే.?
ఈ నిర్మాణ సంస్థలకు అర్ద శతాబ్దం పూర్తి.. ఇప్పటికి టాప్‌లోనే..
తెలుగులో కాయాదు చేసిన ఏకైక సినిమా ఇదే..