జోరు పెంచిన మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్.. 

21 November 2025

Pic credit - Instagram

Rajeev 

కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది

 ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. దాంతో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. 

హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది

ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది.

ఇటీవలే కొత్త లోక సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కళ్యాణి ప్రధాన పాత్రలో నటించింది. 

ఈ సినిమా ఏకంగా వందకోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.