TV9 Telugu
22 April 2024
జాన్వీ ఎలాంటి ఫుడ్
తీసుకుంటుందో తెలుసా.?
శ్రీదేవీ కూతురుగా నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ అందాల తార జాన్వీ కపూర్. తొలి సినిమాతో ప్రేక్షకులను మదిని దోచింది.
తొలి చిత్రం సైరత్‌లో నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి తన అభిరుచి ఎలాంటిదో చెప్పకనే చెప్పంది. ఇక ఆ తర్వాత మంచి ఆచితూచి పాత్రలు ఎంచుకుంటోంది.
సినిమాల్లో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే జాన్వీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోందీ బ్యూటీ.
తన అందంతో ఆకట్టుకునే జాన్వీ డయిలీ రొటీన్‌కు సంబంధించిన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఉదయం లేవగానే జాన్వీ కచ్చితంగా రన్నింగ్, సైక్లింగ్‌తో పాటు 45 నిమిషాలు కార్డియో వర్కవుట్స్ చేస్తానని తెలిపింది. ఇక యోగా కూడా జాన్వీ లిస్ట్‌లో ఉంది.
ఇక జాన్వీ ఫుడ్ విషయానికొస్తే ప్రతీరోజూ ఉదయాన్నే కచ్చితంగా ఒక స్పూన్ దేశీ నెయ్యిని తీసుకుంటుంది. తన ఆరోగ్యానికి ఇదే కారణమని చెబుతోంది.
అలాగే ఉదయాన్నే బ్లాక్ కాఫీని తీసుకుంటానని చెప్పుకొచ్చుంది. బ్రేక్ ఫాస్ట్‌లో తాజా పండ్లు లేదా రోటీని తీసుకుంటానని తెలిపింది.
ఇక మధ్యాహ్నం భోజనంలో చికెన్ తీసుకుంటానని తెలిపిన జాన్వీ.. రాత్రి మాత్రం కచ్చితంగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటానని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..