ఓహో.. జాన్వీ బ్యూటీ సీక్రెట్ ఇదేనా

Narender Vaitla

05 November 2024

శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార జాన్వీ కపూర్‌. నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది.

తొలి సినిమా ధడక్‌తో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రలు కాకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించి మెప్పించింది.

ఇక ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన దేవర సినిమాతో ఎట్టి కేలకు తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. ఈ సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్‌ విజయాన్ని నమోదు చేసుకుంది.

జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. ఈ సినిమాలో తన అందందో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఇంతకీ తన అందానికి కారణమేంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అందాన్ని కాపాడుకునే క్రమంలో తాను నేచురల్‌ టిప్స్‌నే పాటిస్తానని చెప్పుకొచ్చింది. తల్లి శ్రీదేవి సూచించిన టెక్నిక్‌ను ఇందుకోసం ఫాలో అవుతానని చెప్పుకొచ్చింది.

ఫ్రూట్ మాస్క్ లను.. ఎక్కువగా వాడుతుండట. తాను మొదటి నుంచి ఈ ఫ్రూట్ మాస్కులను.. ముఖానికి వాడతానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ముఖ్యంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ను ఉపయోగిస్తుందంటా.

పండ్లను మెత్తగా రుబ్బి అందులో పెరుగు, తేనె మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆ తర్వాత సగం కట్ చేసిన ఆరెంజ్ సాయంతో ముఖాన్ని సున్నితంగా రుద్దాలి.

ఇలా 10 నిమిషాలు చేసుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేస్తుందంటా. ఇలా క్రమంతప్పకుండా చేయడం వల్లే తాన అందంగా పదిలంగా ఉందంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.