నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ దూసుకుపోతోంది. అందాల తార జాన్వీ కపూర్.
శ్రీదేవీ కూతురిగా నట వారసత్వం ఉన్నా ధడక్‌లాంటి చిన్ని సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ చిన్నది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనిపించే జాన్వీ సినిమాల్లో మాత్రం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ.
కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మరి అందానికే అసూయ పుట్టేలా ఉండే జాన్వీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా.?
గతంలో ఇచ్చిన ఓ ఇంటర్యూలో తన బ్యూటీ సీక్రెట్‌కు తన తల్లి చెప్పిన ట్రిక్ కారణమని తెలిపింది జాన్వీ. బ్రేక్‌ఫాస్ట్‌లో తినగా మిగిలిపోయిన పళ్ల ముక్కలతో మొహానికి మసాజ్ చేసుకునేదంటా.
శ్రీదేవీ అలా చేయగానే మొహం మిలమిల మెరిసిపోయేదని తాను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో సీక్రెట్‌ను కూడా బయటపెట్టింది.
అందాన్ని సంరక్షించుకోవడానికి పాల ఉత్పత్తులు, పాల క్రీమ్‌లతో చేసిన ఫేస్ ప్యాక్‌లు వాడతానని చెప్పింది. ఇది చర్మం తాజాగా మెరుస్తూ ఉండటానికి సహాయపడతాయని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో దేవర మూవీతో పాటు.. హిందీలో మరో రెండు చిత్రాలతో బిజీగా ఉంది.