జాన్వీ అందం అసలు రహస్యం ఇదే..
08 February 2024
TV9 Telugu
నటవారసత్వం ఉన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న సైరత్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్.
తొలి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది.
కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ మెప్పిస్తోంది. ఇప్పటి వరకు జాన్వీ చేసిన చిత్రాలన్నీ ఇలాగే ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ఈ చిన్నది, సినిమాల్లో మాత్రం గ్లామర్ పాత్రలకు దూరం ఉంటోంది.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిత్యం ఫొటోలు పోస్ట్ చేస్తూ, తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతోందీ చిన్నది.
ఇక జాన్వీ తన అందాన్ని రక్షించుకునేందుకు ఎక్కువ పాల ఉత్పత్తులను ఉపయోగిస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
పాల క్రీమ్‌లతో చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తానని తెలిపిన జాన్వీ, వీటి వల్లే తన చర్మం తాజాగా, మెరుస్తూ ఉంటుందని తెలిపింది.
చర్మం హైడ్రేటెడ్‌గా ఉండడంతో పాతు, డెడ్ సెల్స్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, తొలగించడానికి సహాయపడుతుందని జాన్వీ చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..