11 June 2024

అది నిజమైతే బాగుండు.. 

Narender.Vaitla

ప్రస్తుతం ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకులకు పలకరించేందుకు సిద్ధమైన అందాల ఐశ్వర్య ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగు పరిశ్రమ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది.

ఇక పవన్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఓజీ'లో తనకు అవకాశం వచ్చిందని పుకార్లు షికార్లు చేశాయని, అయితే తొలిసారి ఈ రూమర్‌ నిజమైతే బాగుండు అని ఐశ్వర్య తెలిపింది.

ఇక స్పై తర్వాత తనకు తెలుగులో చాలా ఆఫర్స్‌ వచ్చాయని అయితే.. జాగ్రత్తగా కథల్ని ఎంచుకుంటున్నాని తెలిపింది. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తున్నాని చెప్పుకొచ్చింది. 

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. తాను పుట్టింది, పెరిగిందీ అంతా తమిళనాడులోనేని స్కూల్‌డేస్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని చెప్పుకొచ్చింది.

ఇక కెరీర్‌ తొలినాళ్లలో కమర్షియల్‌ యాడ్స్‌లో నటించానని, అలాగే స్కూల్‌ కల్చరల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనడంతో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపింది. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక నటనను కెరీర్‌గా ఎంచుకున్నానని చెప్పుకొచ్చింది.

నిజానికి తెలుగులో ఐశ్వర్య సంతకం చేసిన తొలి సినిమా ‘భజే వాయు వేగం’ అంటా.. కానీ తర్వాత ఓకే చేసిన ‘స్పై’ సినిమా ముందు రిలీజ్‌ అయ్యిందని చెప్పుకొచ్చిందీ చిన్నది.

తాను ఒక క్లాసికల్ డ్యాన్సర్‌నని, భరతనాట్యం నేర్చుకున్నాని చెప్పుకొచ్చింది. జనానికి గుర్తుండిపోయేలా డ్యాన్స్‌ చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టిందీ చిన్నది.

ఇక ప్రస్తుతం తాను మూడు సినిమాల్లో నటిస్తున్నాని, మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయని తెలిపింది. నటనలో చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగిపోతానని చెప్పుకొచ్చింది.