దేవదాసు సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార ఇలియాన. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ చిన్నది వరుస ఆఫర్లను దక్కించుకుంది.
ఆ తర్వాతే పోకిరి వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత భారీ సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగులో ఓ రేంజ్‌లో సక్సెస్ అయిన ఇలియానా బాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. హిందీలో ఈ బ్యూటీకి పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పాలి.
జులాయి తర్వాత తెలుగులో మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందీ బ్యూటీ. ఆ తర్వాతే బర్ఫీ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది
ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో ఇలియానా తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘బర్ఫీ’ సినిమా చేసిన తర్వాతే తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని తెలిపింది.
ఈ సినిమాలో నటించడంతో అందరూ నేను దక్షిణాదిని వదిలేసి బాలీవుడ్‌కు మకాం మార్చానని అనుకున్నారు. సౌత్‌లో ఇక నటించననే అపోహతోనే నాకు అవకాశాలు రాలేవని అభిప్రాయపడింది.
అలాగే తాను బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత సినిమాల ఎంపిక చేసే విధానంలో మార్పు వచ్చిందని, చాలా సెలక్టివ్‌గా వ్యవహరించాలని అసలు విషయం తెలిసింది.
ఇక ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. తనకు రావాల్సిన గుర్తింపు రాలేదనిపిస్తుందని, దానికి కారణం కూడా తెలీదని ఇలియానా చెప్పుకొచ్చింది