సమంత వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైందా ??

సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

ముఖ్యంగా చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పై నెగిటివిటీ కూడా పెరిగింది.

పనిగట్టుకుని ఆమె పై కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సమంత వల్ల ఓ హీరోయిన్ కెరీర్ నాశనమైందట.

ఆమె మరెవరో కాదు దివ్యాంశ కౌశిక్. ఈమెకి సమంతకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా?

దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ‘మజిలీ’ సినిమాతో..!

అయితే దివ్యాంశ కౌశిక్ పాత్రకే ఈ సినిమాలో ప్రాముఖ్యత ఎక్కువ. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

ఈ నేపథ్యంలో నాగ చైతన్య- సమంత ల మధ్య లిప్ లాక్ తో పాటు ఇంకా కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటాయట.

వాటన్నిటినీ సమంత దగ్గరుండి డిలీట్ చేయించినట్టు ఇన్సైడ్.

అవి కనుక సినిమాలో ఉండుంటే.. దివ్యాంశ కెరీర్ కి బాగా ప్లస్ అయ్యుండేది. కానీ ‘మజిలీ’ లో ఆమె పాత్రని సైడ్ చేసేసినట్టైంది.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినా దివ్యాంశ కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు.