అప్పుడు బిజీ బిజీ.. ఇప్పుడు స్లో అండ్ స్టడీ.. ఈ అమ్మడికి ఆఫర్స్ రావడం లేదా.?

16 November 2025

Pic credit - Instagram

Rajeev 

కేథరిన్ థ్రెసా.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. దుబాయ్ లో మలయాళీ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. 

చిన్నప్పుడే పియానో, నృత్యం, గానం, ఐస్ స్కేటింగ్, డిబేటింగ్‌ నేర్చుకుంది. అదే సమయంలో ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ వాలంటీర్‌గా చేసింది.

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2013లో చమ్మక్ చల్లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఇందులో వరుణ్ సందేశ్ హీరోగా నటించారు. ఈ సినిమా సక్సెస్ కాలేదు. కానీ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన పైనా చిత్రంలో నటించింది. అల్లు అర్జున్ జోడిగా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో నటించింది. 

రానాతో నేనే రాజు నేనే మంత్రి, గోపిచంద్ సరసన గౌతమ్ నంద వంటి చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్మురేపింది. 

స్టార్ హీరోల సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకీ స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇప్పటికీ తెలుగుతోపాటు తమిళం చిత్రాల్లో నటిస్తుంది.