మల్లేశం సినిమాలతో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల తార అనన్య నాగళ్ల. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో నటించి మెప్పించింది.
ఈ సినిమా తర్వాత అనన్యకు వరుసగా అవకాశాలు దక్కాయి. అయితే ఇవేవి ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పాలి.
ప్రస్తుతం అనన్య నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తంత్ర అనే హారర్ మూవీతో పాటు, పొట్టేల్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
తంత్ర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనన్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పొట్టేల్ మూవీలోని కిస్ సీన్ గురించి ఓపెన్ అయ్యిందీ బ్యూటీ.
ఇలాంటి సన్నివేశాలు తంత్రలో కూడా ఉంటాయా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. 'ముద్దు సన్నివేశమనేది ఆ సినిమాకు చాలా అవసరం. అందుకని చేయాల్సి వచ్చిందన్నారు.
అయితే తంత్ర సినిమాలో గ్లామర్, రొమాంటిక్ సీన్స్, హారర్ లాంటి అన్ని సన్నివేశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తుంటాయని అనన్య తెలిపింది.
పర్ఫామెన్స్ చేస్తే చాలని అనుకున్నాని కానీ.. పర్ఫామెన్స్‌లో ఈ తరహా రోల్స్ కూడా భాగమేనని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టిందని చెప్పుకొచ్చింది.
దీంతో కథ డిమాండ్ చేయాలే కానీ బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి తాను ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పిందీ బ్యూటీ.