TV9 Telugu

10 March 2024

నాతో అలా ఎవరు ప్రవర్తించలేదు.. 

అనన్య నాగళ్ల తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి మార్కులే కొట్టేసింది.

మల్లేశం సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. తొలి సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో నటించి, తన నటనతో మెప్పించింది. 

అనంతరం పలు చిత్రాల్లో నటించినా అనన్యకు ఆశించిన విజయం మాత్రం దక్కలేదని చెప్పాలి. కానీ ఆఫర్లు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి. 

ఇక సినిమాల్లో పెద్దగా గ్లామర్‌ పాత్రలో కనిపించని  ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామరస్‌ ఫొటోలతో కుర్రకారుల హృదయాలను కొల్లగొడుతుంది.

ఇక తాజాగా అనన్య తంత్రా అనే సినిమాలో నటిస్తోంది. హారర్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య కాస్టింగ్ కౌచ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని తాను కూడా విన్నానని చెప్పింది. 

అయితే ఇప్పటి వరకు తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని, తనతో ఇప్పటి వరకు ఎవరు అలా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. 

ఇక గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ.. పాత్ర డిమాండ్ చేస్తే తాను గ్లామర్‌ పాత్రలో నటించేందుకు సిద్ధమని తేల్చి చెప్పింది.