13 August 2023

అలియా భట్ అక్కడ గెస్ట్ ఎంట్రీ మాత్రమే ఇచ్చారా..?

బాలీవుడ్ క్యూటీ అలియా భట్‌ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ బ్యూటీ ఫాన్లింగ్ ఎలా ఉండబోతుందన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.

మరి ఈ విషయంలో అలియా ఏం అనుకుంటున్నారు.? ప్రజెంట్ బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో టాప్‌ 3లో ఉంటారు ఆలియా

రీసెంట్‌గా అమ్మ పోస్ట్‌కు ప్రమోట్‌ అయినా కెరీర్ విషయంలో ఎలాంటి గ్యాప్‌ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లోకి సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన హిట్ అందుకుంది అలియా.

బాలీవుడ్‌లో ఇంత బిజీగా ఉంటూనే హాలీవుడ్ వైపు కూడా అడుగులు వేశారు అలియా భట్‌. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి 

త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలో యాక్షన్ రోల్‌లో నటించారు. ప్రెగ్నెంట్‌ టైంలోనే యాక్షన్‌ సీన్స్‌ చేసింది 

అయితే అలియా హాలీవుడ్‌ ఎంట్రీ తరువాత ఆమె కెరీర్‌ గురించి గట్టిగానే చర్చే జరుగుతోంది. ఈ బ్యూటీ ప్రియాంక చోప్రాలా హాలీవుడ్‌లోనే కంటిన్యూ అవుతారా..?

లేక దీపిక పదుకొన్‌లా హాలీవుడ్‌కు గెస్ట్‌గా వెళ్లి వస్తుంటారా? అనే విషయంలో డిస్కషన్ మొదలైంది.

బాలీవుడ్‌లో టాప్ బ్యూటీ అనిపించుకోలేకపోయిన ప్రియాంక చోప్రా వెస్ట్రన్‌ వరల్డ్‌లో మాత్రం సూపర్ స్టార్‌గా ఎదిగారు.